10-10-2025 12:36:22 AM
కొత్తపల్లి, అక్టోబరు 9 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో గురువారం ప్రపంచ తపాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తపాల సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని, ఈ సేవల ద్వారా ఎన్నో అవసరాలు తీరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
అనంతరం విద్యార్థులు కొత్తపల్లి తపాలా కార్యాలయాన్ని సందర్శించి సబ్ పోస్ట్ మాస్టర్ సంపత్ కుమార్, పర్యవేక్షకులు, పోస్టల్ సిబ్బందికి జ్ఞాపికలను ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.