calender_icon.png 10 October, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి

10-10-2025 12:41:32 PM

గంగాధర, (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి(Gram Panchayat Secretary ) అనిల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన గంగాధర శ్రీకాంత్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోగా, బిల్లు పేమెంట్ మంజూరి కోసం రూ. 10 వేలు డిమాండ్ చేసినట్టు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు ముందస్తుగా శ్రీకాంత్ కు డబ్బులు అందించి గ్రామ కార్యదర్శికి ఇస్తుండగా వల పన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ చిక్కిన కార్యదర్శి అనిల్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ దాడులలో ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.