10-10-2025 10:42:07 AM
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ(BJP State Election Committee meeting) శుక్రవారం సమావేశం అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, చంద్రశేఖర్ తివారీ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election) అభ్యర్థి ఖరారుపై భేటీలో చర్చిస్తున్నారు. కిషన్ రెడ్డి, చంద్రశేఖర్ తివారీ ముందు రామచందర్ రావు త్రిసభ్య కమిటీ నివేదిక తెరిచారు. త్రిసభ్య కమిటీ ఐదుగురు పేర్లతో కూడిన జాబితా ఇచ్చింది. ఎన్నికల కమిటీ ఐదుగురిలో ముగ్గురి పేర్లు ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేస్తుంది. మూడు పేర్లను ఎంపిక చేసి రామచందర్ రావు అధిష్ఠానానికి పంపనున్నారు. ముగ్గురిలో ఒకరి అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం ఖరారు చేయనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీవ్ యాదవ్ పోటీ చేస్తున్నారు.