calender_icon.png 10 October, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి

10-10-2025 12:34:56 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు

కరీంనగర్, అక్టోబరు 9 (విజయ క్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు డిమాండ్ చేశారు. వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. 9ను న్యాయస్థానం కొట్టివేయడం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా బీసీ వర్గాల సమాజానికి తీవ్ర నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఈ జి.ఓ. చట్టపరంగా నిలబడదని, రాజ్యాంగపరమైన ఆధారం లే దని పూర్తిగా తెలిసే ఉద్దేశపూర్వకంగా జారీ చేశారని, ఆయనకు ముందుగానే ఈ ఆదేశాన్ని కోర్టు కొట్టివేస్తుందని తెలిసినా, ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు నాటకం ఆడారని విమర్శించారు.

కోర్టులో విచారణ జరుగుతున్న రోజునే మంత్రి వర్గ సభ్యులను హైకోర్టు, సుప్రీంకోర్టులకు పంపిస్తూ, తాను జి.ఓ.కు అనుకూలంగా తీర్పు రావాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రజల్లో తప్పుడు భావన సృష్టించారని, ఇది ప్రజలతో చేసిన మోసం మాత్రమే కాదని, బీసీ వర్గాల ఆశలతో నిర్దయమైన ఆట అని తెలిపారు. తెలంగాణ సమాజం ఈ రాజకీయ మాయచాటువులను ఎప్పటికీ క్షమించదని పేర్కొన్నారు. న్యాయస్థానంపై ఎలాంటి నింద వేయరాదని, ఎందుకంటే చట్టం రాజ్యాంగం ప్రకారం నిర్ణయం ఇచ్చారనితెలిపారు.