calender_icon.png 10 October, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడం సరికాదు: ఆర్. కృష్ణయ్య

10-10-2025 12:03:35 PM

హైకోర్టు తీర్పుపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది

హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు(Telangana High Court) స్టే విధించడం దారుణమని ఆర్. కృష్ణయ్య(R Krishnaiah) అన్నారు. బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడం సరికాదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బలమైన ఆధారాలతోనే జీవో నెంబర్ 9 విడుదల చేశారని చెప్పారు. డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా లెక్కలు తీశారని ఆర్. కృష్ణయ్య సూచించారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపైనా అనుమానాలున్నాయని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు(BC reservations) పెంచుకోవచ్చని రాజ్యాంగంలో 243/D6 షెడ్యూల్ లో ఉందని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. మేమెంత ఉన్నామో మాకంత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పెట్టాలని పార్లమెంట్ లోనూ పోరాడుతున్నామని వెల్లడించారు. ఇవాళ బీసీ సంఘాల తరఫున ర్యాలీలు, నిరసనలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర బంద్ కి పిలుపునిస్తామని పేర్కొన్నారు. మాది ఆత్మగౌరవ పోరాటం అని ఆర్. కృష్ణయ్య తెలిపారు.