10-10-2025 12:14:19 PM
పార్కు స్థలం కబ్జాపై స్థానికుల కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు
ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రాధికారులు
అబ్దుల్లాపూర్ మెట్: తట్టి అన్నారంలోని హైడ్రా(Hydra) దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఓ కబ్జా దారుడి ఆటకట్టించింది. కబ్జా కోరులకు చెంపపెట్టు లాంటి చర్యలు చేపట్టింది హైడ్రా... రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం గ్రామం లక్ష్మీ గణపతి కాలనీలోనీ 700 గజాల పార్క్ స్థలాన్ని ఓ పార్టీ నాయకుడు అనంతుల వెంకటేశ్వర్ రెడ్డి కబ్జా చేశాడు. కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా కాలనీ వాసులు భూ కబ్జా వ్యవహారంపై హైడ్రా కమీషనర్ రంగనాథ్(HYDRA Commissioner AV Ranganath)కు పిర్యాదు చేశారు. దీంతో సమగ్ర విచారణ చేపట్టి కబ్జా జరిగింది వాస్తవమేననీ హైడ్రా అధికారులు ధృవీకరించారు. కబ్జా బాగోతంపై సీరియస్ అయ్యారు. ఆ అక్రమ నిర్మాణాలను శుక్రవారం ఉదయం కూల్చేశారు. కబ్జాకు గురైన ఖరీదైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పారు. హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.