calender_icon.png 30 January, 2026 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంగ్లిష్ ఒలంపియాడ్‌లో బంగారు పతకాలు

30-01-2026 12:00:00 AM

కొత్తపల్లి, జనవరి 29 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో బంగారు పతకాలు సాధించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు వి.వేదవిహార్, కె. సుకృత, బి. తన్మయి, టీ అమితా విక్రంలు బంగారు పతకాలు సాధించారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. విజేతలందరికీ పుష్పగుచ్చాలను అందజేసి రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.