30-01-2026 09:07:27 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పరిధి ఘనపూర్ లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో శుక్రవారం హ్యూమన్-సెంట్రిక్ ఏఐపై ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్–2026 ను నిర్వహించారు. వచ్చేనెల ఫిబ్రవరిలో జరగనున్న ప్రతిష్టాత్మక ఏఐ ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్–2026 కార్యక్రమంలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి అనే అంశంపై ప్రీ-సమ్మిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని ఏఐసిటిఈ ఆధ్వర్యంలో నిర్వహించగా కేపేబుల్ సంస్థ నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏఐ ఆధారిత భవిష్యత్తుకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధిపై, నైతికత, సమావేశత, మానవ కేంద్రీత కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కార్యక్రమాన్ని జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సుల్తాన్‌పూర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. విశ్వనాథ రాజు, సింక్ ఏఐ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మణికంఠ సఖమూరి అధికారికంగా ప్రారంభించారు.
కార్యక్రమానికి కేపిఆర్ఈఎస్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరించగా కెపిఆర్ఐటి వైస్ ప్రిన్సిపాల్, ఐఐసి అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ కశ్యప్ అధ్యక్షత వహించారు. ఈవర్క్‌షాప్ ద్వారా మొత్తం అధ్యాపక బృందం మరియు 257 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. పాల్గొన్నవారికి ఆధునిక ఏఐ టూల్స్‌పై ప్రాక్టికల్ అనుభవం ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలు లభించాయి. కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా, సంస్థ మేనేజ్‌మెంట్, డైరెక్టర్, ప్రిన్సిపాల్ వివిధ విభాగాల అధిపతులు, కెపిఆర్ఐటి ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈకార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన డాక్టర్ కె. వంశీకృష్ణ, హెచ్‌ఓడీ, సీఎస్ఈ అండ్ ఐఐసి కన్వీనర్ నిర్వహణ బృందాన్ని అభినందించారు.