calender_icon.png 30 January, 2026 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యగిరీంద్ర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

30-01-2026 12:00:00 AM

మానకొండూరు, జనవరి 29 (విజయక్రాంతి): మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి గురువారం మానకొండూ రు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి స్వామివారికి గురువారం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకు లు వారికి మంగళ శాసనాలు,ఆశీర్వచనాలు అందజేశారు.

నియోజకవర్గ ప్రజలంతా సు ఖశాంతులతో ఆరోగ్యకరమైన జీవనం గడపాలని, సంపదలతో, ప్రజలే కాకుండా రా ష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు కవ్వంపల్లి తెలిపారు.  మహోత్సవానికి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దడమే కాకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన పాలకవర్గాన్ని ఆయన అ భినందించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోరం రాజిరెడ్డి, పీసీసీ సభ్యుడు బత్తి ని శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, ఆలయ మా జీ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి తో పాటు పా లకవర్గ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచు లు, పార్టీ నాయకులు,కార్యకర్తలు,త తరులు కళ్యాణమహోత్సవానికి హాజరయ్యారు.