08-10-2025 09:58:53 PM
టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): జిల్లాలో మొదటి విడత జరగనున్న జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవో లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 6 జడ్పిటిసి, 58 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మొదటి విడత ఘనపూర్, చిట్యాల, రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాలకు ఎన్నికలు జరగనున్నట్లు 19 మంది రిటర్నింగ్ అధికారులు నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాలని ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని ఇలాంటి చట్ట విరుద్ధ చర్యలు చోటు చేసుకోకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఏ.ఎస్.పి నవీన్ కుమార్, రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తాసిల్దార్ లు, ఎంపీడీవో లు తదితరులు పాల్గొన్నారు.