08-10-2025 10:47:40 PM
అదనపు కలెక్టర్ చెన్నారెడ్డి సూచన..
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులపై అధికారులతో అడిషనల్ కలెక్టర్ చెన్నారెడ్డి రివ్యూ..
ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా అదనపు కలెక్టర్ చెన్నారెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో వరి ధాన్యం సేకరణ వానాకాలం 2025-26 ధాన్యం కొనుగోళ్లపై బుధవారం జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ మెంబర్స్ తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వానాకాలం 2025-26 సీజన్ కోసం, జిల్లా యంత్రాంగం(33) వరి కొనుగోలు కేంద్రాలను అంటే (3) పిపిసిఎస్-ఐకెపి, 23-పిఎసిఎస్, 7-సిడిఎంఎస్ లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సన్నరకం @15,000 Mts, దొడ్డురకం @15,000 Mts కింద వరిని కొనుగోలు చేయాలని అంచనా వేయడం జరిగిందన్నారు. ఇలా మొత్తం 30,000 Mts కొనుగోలు చేయడం జిల్లా లక్ష్యమణి, నవంబర్ మొదటి వారంలో ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది.
ఎంఎస్పి: గ్రేడ్-A-రూ.2389/- ప్రతి క్వింటాల్, కామన్ - రూ.2369/- ప్రతి క్వింటాల్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోనస్ రూ. సన్నరకం వరి పంటకు క్వింటాల్ కు రూ.500/- రైతులకు అదనపు ప్రయోజనం కోసం అనగా రూ.2,889/- చెల్లించబడుతుంది. జిల్లాలో సన్నరకం, దొడ్డు రకం వరి రకాలకు వేర్వేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలు తెరవనున్నారు. కొనుగోలు కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలకు, కంట్రోల్ రూమ్ నెంబర్లకు సమందించిన బ్యానర్లు ఏర్పాటు చెయ్యాలి. మార్కెటింగ్ అధికారి కొనుగోలు కేంద్రాలకు సరిపడా వరి శుభ్రపరిచే పరికరాలు, తేమ మీటర్లు, తూకం వేసే యంత్రాలు, ధాన్యం కాలిపర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలనీ అదనపు కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి మంచి నీరు, ఆశ్రయం, విద్యుత్ సదుపాయాలు ఉండేటట్టు చూసుకోవాలని తెలిపారు. ఏఈఓలు/ఏవోలు/ఏడిఏలు 2.5 ఎంఎం కంటే ఎక్కువ పొడవు, వెడల్పు నిష్పత్తిని కొలవడానికి ధాన్యం కాలిపర్ పరికరాలను ఉపయోగించడం ద్వారా పిపిసిల వద్ద రైతులు తీసుకువచ్చే వరి రకాల నాణ్యతను ధృవీకరించాలన్నారు.
ఏఈఓల నుండి ధృవీకరణ పొందిన తర్వాత మాత్రమే, పిపిసి ఇన్చార్జిలు అటువంటి వరి వివరాలను ఓపిఎంఎస్ లో నమోదు చేస్తారు. వాటిని ట్యాగ్ చేయబడిన మిల్లులకు తరలిస్తారని పేర్కొన్నారు. మిల్లుకు పంపే ముందు, పీపిసి ఇన్చార్జీలు కొత్త గన్నీ సంచులపై "ఎస్" అక్షరాన్ని గుర్తుపెట్టి, సన్నారకం రకానికి 'రెడ్ కలర్' దారంతో బ్యాగ్లను కుట్టడం సులువుగా గుర్తించడానికి, దొడ్డు రకం వరిని ఆకుపచ్చ రంగు దారం తప్పనిసరి అని తెలిపారు. ఓపిఎంఎస్ లో అదే రోజున వివరాలు చెల్లింపు కోసం డిఎం, సిఎస్ కు వెంటనే సమర్పించండి (72) గంటలలోపు ఏదైనా నాణ్యత సంబంధిత సమస్యలు తలెత్తితే, వాటిని పరిష్కరించడం కోసం సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకురాబడుతుందన్నారు. అదే విధంగా, అన్ని పిపిసి ఇన్ఛార్జీలు ఊహించని వర్షాలు ఏవైనా ఉంటే వాటిని తెలుసుకోవడం కోసం "వాతావరణ యాప్"ను ఇన్స్టాల్ చేయమని సూచించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జె.హరీష్, జిల్లా మేనేజర్- సివిల్ సప్లయిస్, డిసిఎస్ఓ వనజాథ, డిఆర్డిఓ శ్రీలత, డిసిఒ సి.సుధాకర్, డీఈవో డీఉషా, డిఎంఓ ఎండి.రియాజ్, డిఎల్ఎంఓ పి.శ్రీనివాస్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అసిస్టెంట్ మేనేజర్లు(సిఎస్), డీటీలు ఏ డిఏలు ఏపీఎంలు పిఎసిఎస్ డీసీఎంఎస్ ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.