08-10-2025 10:38:21 PM
ఇసుక కాంట్రాక్టర్ vs ఓ పర్సనల్ అసిస్టెంట్..
గోప్యంగా ప్రెస్ మీట్ లు..
చర్ల (విజయక్రాంతి): మండలంలో తాజాగా ఓ ప్రముఖ ఇసుక ర్యాంపు యజమాని, ఓ ప్రముఖ పేరుపొందిన పర్సనల్ అసిస్టెంట్ మధ్య ఇసుక వ్యవహారంలో మంగళవారం డిశు డిశుం జరిగింది. అయితే ఇది గోప్యంగా ఉండడంతో ఇరుపక్షాల వర్గాలు తమదే తప్పు లేదంటూ పుకార్లు పుట్టించుకోస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ మాత్రం బుధవారం గుట్టు చప్పుడు కాకుండా ప్రెస్ మీట్ పెట్టి వారి గోడును వినిపించుకున్నట్లు తెలుస్తుంది. ర్యాంపు వ్యవహారంలో ఇరుపాక్షాల మధ్య వాగ్వివాదం జరిగి ఒకరిపై ఒకరు చేతులు చేసుకున్నట్లుగా తెలుస్తుంది.
అసలు వ్యవహారమంతా ఎందుకు వచ్చింది అంటే ఇసుక ర్యాంపు నడిపిస్తున్న కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు కావాలంటూ ఆ పర్సనల్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడని కాంట్రాక్టర్ ఆరోపిస్తుంటే ఆ పర్సనల్ అసిస్టెంట్ మాత్రం తను డబ్బులు డిమాండ్ చేయలేదని తన పర్సనల్ పని మీదా కొయ్యూరు వెళ్తుండగా కావాలనే రాజకీయ కక్షతో నాపై గొడవకు వచ్చారంటూ ఆరోపిస్తున్నాడు. ఏది అయినప్పటికీ చర్ల మండలంలో ఇసుక ర్యాంపులలో ఇటువంటి వ్యవహారాలు రాను రాను ముదిరి పాకనపడుతున్నాయి.