calender_icon.png 9 October, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి నామినేషన్లు షురూ

08-10-2025 10:19:26 PM

హనుమకొండ (విజయక్రాంతి): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నియమ నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు ఉండాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు .బుధవారం సాయంత్రం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. నిబంధనలను మేరకు నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయా మండలాల ఎంపీడీవోలు సిద్ధం చేయాలన్నారు. ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టి  బృందాలను ఏర్పాటు చేసి షిఫ్టులవారీగా విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్ల ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలన్నారు. నామినేషన్ల సందర్భంగా నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులతో ఎన్నికలకు సంబంధించిన పలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో రవి, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎంసీసి నోడల్ ఆత్మారామ్, తదితరులు పాల్గొన్నారు.