08-10-2025 10:35:00 PM
అశ్వాపురం పోలీసుల వలలో లారీ..
అశ్వాపురం (విజయక్రాంతి): మణుగూరు మండలం రామానుజవరం ఇసుక ర్యాంపు నుంచి బుధవారం నకిలీ డీడీలతో నాలుగు లారీలు బయలుదేరినట్లు అధికారులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో, అందులో ఒక లారీని అశ్వాపురం పోలీసు స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. మిగతా మూడు లారీలు కొత్తగూడెం వైపు తరలినట్లు సమాచారం. ఇసుక రవాణాకు సంబంధించి సరైన పత్రాలు లేకుండా నకిలీ డీడీలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాపై పోలీసులు దృష్టి సారించారు. పట్టుబడిన లారీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు అశ్వాపురం పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సంఘటనతో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు నిఘా మరింత పెంచనున్నారు.