08-10-2025 10:01:30 PM
ములకలపల్లి (విజయక్రాంతి): ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో పిడుగు పడటంతో గడ్డిల్లు దగ్ధమైంది. పిడుగు పాటుకు గురై గడ్డిల్లు దగ్దం అయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మూక మామిడి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మూకమామిడి గ్రామానికి చెందిన ములకేశ్వరరావుకు ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయింది.
ఇల్లు కట్టుకునే క్రమంలో తన పాత ఇంటిని తొలగించిన ములకేశ్వరావు కుటుంబం సహ పక్కనే ఉన్న బొడ్డేటి సురేష్ కు చెందిన గడ్డి ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి ములకేశ్వరావు ఉంటున్న ఇంటిపై పిడుగు పడింది. ఈ ప్రమాదం లో ఇంటితో పొటు,ఇంట్లో సామాన్లు పూర్తిగా కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. పిడుగు పడిన సమయం లో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.