08-10-2025 10:43:23 PM
శ్రీకాంత్ భరత్ పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సేవాలాల్ బంజారా సంఘం నాయకుల ఫిర్యాదు..
ఎల్బీనగర్: జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత అసభ్యకరమైన కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ భరత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు బుధవారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఐ సైదిరెడ్డికి సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షులు కొర్ర మోతిలాల్ నాయక్ ఫిర్యాదు చేశారు. జాతిపితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం నాయకులు పాల్గొన్నారు.