calender_icon.png 9 October, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు జన్మదిన వేడుకలు..

08-10-2025 10:22:02 PM

కోదాడ: పట్టణంలోని తారా టీ స్టాల్ వద్ద కోదాడ టౌన్ యూత్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు అబ్దుల్ అజీమ్ జన్మదిన వేడుకల బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి యూత్ సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్ధుల్ మాలిక్, షేక్ షఫీ, బాజన్, ఖలీల్, షరీఫ్, అలీ భాయ్ గంధం పాండు, దాదావలీ, రఫీ, ముస్తఫా, కంపటి శ్రీను, షరీఫ్, రఫి, నిహాల్, మస్తాన్, పంది తిరపయ్య తక్కెళ్ళ పటి సాయి, గుండు మహేందర్, వెలుగు వీరన్న, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.