08-10-2025 10:40:42 PM
కందుకూరు: మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం ఎన్టీఆర్ తండాలో పలు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను బుధవారం మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు పి.సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్ ఇటీవల ప్రమాదవశాత్తు కాలికి తీవ్ర గాయాలు కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారని, అలాగే అదే తండాకు చెందిన శీను నాయక్ కుమారుడు చిన్న వయసులో జరిగిన ప్రమాదంలో కోమాలోకి వెళ్లి ఇటీవలే కోలుకున్నారని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శీను నాయక్ కుమారుడికి పెన్షన్ లేదా ఆర్థిక సహాయం అందించే విధంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండలానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తండా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.