08-10-2025 09:31:56 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): కాలేజీకి వెళ్లిన బీటెక్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ కు చెందిన గట్టు సాత్విక్ రెడ్డి(21) అంకుశాపూర్ లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులు ముగిసిన వెంటనే ఈనెల 4వ తేదీన సాయంత్రం అంకుశాపూర్ లోని హాస్టల్ కి వచ్చి 6వ తేదీన ఉదయం హాస్టల్ నుండి కాలేజీకి వెళ్లి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. హాస్టల్ కి గాని ఇంటికి గాని తిరిగి రాకపోవడంతో తండ్రి గట్టు మల్లారెడ్డి బుధవారం ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.