calender_icon.png 16 September, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రైస్తవులందరూ అభివృద్ధిని సాధించుకోవాలి

16-09-2025 02:15:09 PM

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్

వనపర్తి (విజయక్రాంతి): క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండి సమాజంలో తమ అభివృద్ధిని సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్(Telangana State Christian Minority Finance Corporation) చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ సూచించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ వనపర్తి జిల్లాను సందర్శించారు.  జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లాలోని పాస్టర్లు, క్రిస్టియన్ మత పెద్దలతో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi)తో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో క్రిస్టియన్ మతస్తులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించుకునే అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం నడుస్తుందని, అన్ని కులాలను సమానంగా ఆదరిస్తూ, సన్నీ కులాలు, మతాల అభివృద్ధికి కృషి చేస్తున్నందున జిల్లాలోని క్రైస్తవ సోదరులు అందరూ సమిష్టిగా ఐక్యమత్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్రైస్తవులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రైస్తవులకు వెంకటాపూర్ గ్రామంలో చర్చి నిర్మాణానికి అనుమతి ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అక్కడ ప్రార్థనా స్థలం నిర్మించుకోవడానికి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో క్రైస్తవుల సమాధులకు స్థలం కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా క్రైస్తవులకు అందాల్సిన అన్ని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అఫ్జలుద్దీన్, జిల్లాలోని పాస్టర్లు, క్రిస్టియన్ మత పెద్దలు, సంఘం నాయకులు పాల్గొన్నారు.