calender_icon.png 16 September, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రైలు కింద చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన రైల్వే పోలీసులు

16-09-2025 03:40:51 PM

అకోలా: మహారాష్ట్రలోని అకోలా జిల్లా(Akola District)లో 50 ఏళ్ల ఓ వ్యక్తి రైలు కింద చిక్కుకున్నట్లు రైల్వే పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో ముర్తిజాపూర్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ముష్తాక్ ఖాన్ అనే ప్రయాణికుడు పూణే-అమరావతి రైలు(Pune-Amravati Express) ప్లాట్‌ఫామ్ నంబర్ 2 నుండి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి రైలు కింద చిక్కుకున్నారని చెప్పారు. స్థానిక రెస్క్యూ టీం సహాయంతో రైల్వే పోలీసులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి రైలు ఫుట్‌బోర్డ్‌ను తొలగించి ప్రయాణికుడిని సురక్షితంగా బయటకు తీశారని తెలిపారు. కాళ్లకు తీవ్ర గాయాలైన ఖాన్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.