calender_icon.png 16 September, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు హెచ్ఎం చేయూత

16-09-2025 03:10:16 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని హనుమంతుని గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ తోడేటి వెంకన్న 150 మంది విద్యార్థులకు తండ్రి తోడేటి కోటయ్య జ్ఞాపకార్థం టై, బ్యాడ్జి, బెల్టులను బహుకరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి(District Education Officer Dakshina Murthy) విద్యార్థులకు టై, బెల్టులు అందజేసి వెంకన్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీజీ శ్రీరాములు మహబూబాద్, సిరోల్ మండల విద్యాశాఖ అధికారులు ఎస్.వెంకటేశ్వర్లు, లచ్చిరాం, పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ.వెంకటేశ్వర్లు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ మైసా శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు హాల్య, ఉపాధ్యాయులు బాలాజీ కుమార్, శంకర్, సాయి, శిరీష, కిరణ్, రశ్మిత తదితరులు పాల్గొన్నారు.