calender_icon.png 16 September, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి

16-09-2025 02:31:10 PM

మిడ్జిల్: బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిల్వేర్ గ్రామానికి చెందిన జక్కా ఆంజనేయులు(25) బైక్ పై సొంత పనుల కొరకు జడ్చర్లకు వస్తుండగా కొత్తపెళ్లి దగ్గర బొల్లారం వాహనాన్ని అతివేగంతో ఢీకొట్టింది ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని ఆంజనేయులు మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.