16-09-2025 03:21:04 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) 69వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లారపు చిన్నరాజ్యం ,పట్టణ అధ్యక్షులు మల్లయ్య, మాజీ జెడ్పిటిసి రామచందర్, కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ చిలువేరు సత్యనారాయణ, సీనియర్ నాయకులు మునిమంద రమేష్, దావ రమేష్, నయీమ్, మాజీ కౌన్సిలర్లు కటకం సతీష్, బొడ్డు నారాయణ, గెల్లి రాయలింగు, సురేష్, చింతపండు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సన్నీ బాబు, సేవాలాల్ జిల్లా అధ్యక్షులు బండి రాము తదితరులు పాల్గొన్నారు.