calender_icon.png 16 September, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్మశానవాటికలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన

16-09-2025 03:07:56 PM

రామచంద్రపురం: రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని ముస్లిం శ్మశానవాటికలో గతంలో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో సుమారు రూ.7 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్ రేసింగ్, కొత్త నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మైనారిటీ నాయకులు అబ్దుల్ ఘనీ, అబ్దుల్ గఫర్, అబ్దుల్ ఖదీర్, హబీబ్ జానీ, కిరోసిన్ హబీబ్, పీటర్ పాల్స్, అక్బర్, నయీమ్, అహ్మద్, అలీ బాబా, మొయినుద్దీన్, సామ్రాట్, శాంతమ్మ, శ్రీశైలం, ఇబ్రహీం, ఇర్ఫాన్, హన్మంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపనలో భాగమయ్యారు.