calender_icon.png 16 September, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి పంట సాగుపై అవగాహన..

16-09-2025 02:33:49 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): మండలంలోని కుకుడా గ్రామంలో పత్తి పంట సాగు విధానంపై రైతులకు మండల వ్యవసాయ అధికారి నాగరాజు(Mandal Agriculture Officer Nagaraju) అవగాహన కల్పించారు. రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వలన పత్తి పంటలో వచ్చే గులాబి రంగు పురుగును, అన్ని రకాల పంటలో వచ్చే పురుగుల సంతానోత్పత్తి అరికట్టవచ్చును దీనివలన వాటి ఉధృతి తగ్గుతుందని సంరక్షణ చర్యలో భాగంగా లింగ ఆకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారి నాగరాజు సలహాలు సూచనలు రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి మారుతి ,ఆదర్శ రైతు పడాల జగదీష్, మ్యాన్కిండ్ అగ్రిటేక్ ఎండిఏ కమలాకర్, రైతులు పాల్గొన్నారు.