17-10-2025 12:00:00 AM
బీసీ జేఏసీ చైర్మన్ రూపునార్ రమేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు ఈనెల 18న నిర్వహించే బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని జిల్లా బీసీ జేఏసీ చైర్మ న్ రూపునర్ రమేష్ కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగె ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, మాజీ ఎంపీపీలు బాలేశ్వర్ గౌడ్, అబ్దుల్ కలాం, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లాంజనేయులు తోపాటు మేరు సంఘం, గౌడ సంఘం ,యాదవ సంఘం నాయకులను కలిశారు.
జిల్లా కేంద్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా ప్రతినిధులకు వివిధ కుల సంఘాల నాయకులను కలసి మద్దతు కోరారు. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి సంపూర్ణ మద్దతు ప్రక టించారు. వ్యాపారస్తులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని బీసీలకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బీసీ యువజ న సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణ య్, దీపక్ ముండే తదితరులున్నారు.