17-10-2025 12:00:00 AM
ఫిర్యాదులను విచారించిన ఆడిట్ అధికారి దేవేందర్
మంచిర్యాల, అక్టోబర్ 16 ( విజయక్రాంతి ): మంచిర్యాలలోని ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యులు చేసిన ఫిర్యాదులపై గురువారం విచారణ అధికారిగా వచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్ ఫిర్యాదుదారుల, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కాలేజీ రోడ్ లో ని తెల్లకల్లు డిపోలో విచారించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు వర్గాల ఫిర్యాదులను పరిశీలించి, వారి నుంచి సమాచారం సేకరించామని, ఈ వివరాలను పక్షం రోజుల్లోపు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. సంఘం నియమ నిబంధనల మేరకే విచారణ జరు గుతుందని, బైలా ప్రకారం విచారించి నివేది క అందజేయడం జరుగుతుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరి పామన్నారు. అనంతరం ఫిర్యాదుదారులు సైతం వారికి జరిగిన అన్యాయంపై మీడి యా దృష్టికి తీసుకువచ్చారు.