16-10-2025 11:37:52 PM
లెర్నెట్ స్కిల్స్..
ఖమ్మం (విజయక్రాంతి): జిల్లాలోనో ఫోర్ వీలర్ మెకానిక్ లకు నైపుణ్యం పెంపొందించుకొనేందుకు క్యాస్ట్రోల్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని లెర్నెట్ స్కిల్స్ ప్రాజెక్ట్ మేనేజర్ మత్తి రామకృష్ణ అన్నారు. ఖమ్మం లోనో రోటరీనగర్లో గురువారం ఈ కార్యక్రమం ప్రారంభం కాగా మెకానిక్ లకు టీ షర్ట్ లు, బుక్స్ ను క్యాస్ట్రోల్ ఖమ్మం టి ఎల్ ప్రసాద్, శంకర్ చేతుల మీదుగా అందజేశారు. మొదటి రోజు సెన్సర్ లా గురుంచి ట్రైనర్ రాకేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం లోని పలువురు టెక్నీషియన్ లు పాల్గొన్నారు.