01-05-2025 01:59:02 AM
కామారెడ్డి/ఎల్లారెడ్డి, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): జిల్లాలో కల్తీ కల్లు మాఫియా విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా కల్తీకల్లు విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పేద ప్రజలు కల్తీ కల్లు సేవించి ప్రాణాలు కోల్పోతున్నారు.
జిల్లాలోని ప్రతి నియోజకవర్గ ము పరిధిలోని ప్రతి పల్లెలో ప్రతిరోజు కల్తీ కల్లు విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.దీంతో పాటు ఎల్లారెడ్డి ఎక్సుజ్ సిఐ పరిధిలోని మండలాల్లో కూడా వారాంతపు సంతలు జరు గుతున్నాయి. మండల కేంద్రంలో ఎక్సుజ్ అధికారుల అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా కల్లు దుకాణాలను ఏర్పాటు చేసుకుంటు న్నా అధికారులు వారిచ్చే మామూళ్ళ మత్తులో జోగుతూ పట్టించు కోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మామూలు రోజుల్లో నాలుగైదు దుకాణాల్లోనే కల్లును విక్రయిస్తున్నారని అదే ఆదివారం అయితే అనుమతులు లేకుండానే ఇష్టమున్న స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. నూతనంగా ఓ కల్లు దుకాణం ఏర్పాటయింది. అలా ఒక్క ఎల్లారెడ్డి మండల కేంద్రంలోనే కాకుండాఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఎక్సుజ్ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట మండలాల్లోనూ వారాం తపు సంతలు జరుగుతాయని, ఆ ప్రాంతాల్లో కూడా సంతలలో విచ్చలవిడిగా కల్లు దుకాణాలు వెలుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
వారాంతపు సంతలు వచ్చాయంటే కల్లు విక్రయదారులకు వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతున్నాయని ప్రజలు అరోపించారు. సంత ఈరోజు ఉందనగా రాత్రివేళల్లో కల్లును తయారు చేస్తూ ఉదయం లేవగానే ఆటోలలో సంతల ప్రాంతానికి తరలిస్తున్నారు. సమయానికి మంచినీళ్ళు దొరకక పోవచ్చుకాని కల్లు మాత్రం అడుగు అడుగునా దొరుకు తుందని దారినపోయే వారు పేర్కొనడం గమనారం. దుకాణాల ముందు నుండే అధికారులు రాకపోకలు సాగి స్తున్నా అవి మాత్రం కనిపించడం లేదు.
వ్యాపారాన్ని బట్టి మామూళ్ళు ఇస్తుంటామని, వారికి మేమెందుకు భయపడాలని కొందరు కల్లు విక్రయ దారులు బహిరంగంగా పేర్కొనడం గమనారం. ఎక్సుజ్ పరిధిలో ఉన్న ప్రతి మండలంలోని కొన్నిగ్రామాలకు చెందిన కొందురు వ్యాపారులు అధికారుల కనుసైగల్లో ఉంటున్నట్లు తెలిసింది. ఒకవేళ ఏ ప్రాంతానికైనా తనిఖీల కోసం వెళ్లినా కొందరు సిబ్బంది ముందుగానే ఎక్కడికి వస్తున్నామనే విషయాలను కొందరు వాప్యారస్తులకు సమాచారం ఇస్తున్నారని, వారు ముందు జాగ్రత చర్యగా ఉంటున్నట్లు తెలిసింది. వచ్చామా.. వెళ్లామా అనే ధోరిణిలో అధికారులు వ్యవహరిస్తుండటం విడ్డూరంగా ఉందని కొందరు విమర్షిస్తుండటం చూస్తుంటే వారి ఉద్యోగ నిర్వహణ ఎలా ఉందనేది ఇట్టే అర్థమవు తువుంది.
బెల్టు దుకాణాల ఊసెత్తని అధికారులు
కల్లు విక్రయాలది ఇలా ఉంటే బెల్టుషాపుల విక్రయదారులది మరోరకంగా ఉంది. ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట గాంధారి ఎక్సుజ్ సిఐ సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో సుమారుగా 60 కు మించి బెల్టు దుకాణాలున్నట్లు తెలిసింది. వీరి నుండి అధికారులు ప్రతినెలా మామూళ్లు వసూలు చేస్తూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజలనుండి వినిపిస్తున్నాయి. ఇప్పడికైనా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా వెలుస్తున్న కల్లు దుకాణాలు, బెల్టు దుకాణాలను నియంత్రించి తమ కుటుంబ యజమానుల ప్రాణాలను కాపాడాలని జిల్లాలోని ప్రజలు ఎక్సుజ్ అధికారులను కోరుతున్నారు.