calender_icon.png 1 May, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన గణనలో కులగణన గొప్ప ముందడుగు

01-05-2025 01:58:18 AM

  1. అర్హులందరికీ వనరుల పంపిణీ

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జన గణనలో భాగంగా కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయించడం గొప్ప ముందడుగు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఓ ప్రకటనలో కొనియాడారు. జన గణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సామాజిక న్యాయం జరుగుతుందని, దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని ఆకాంక్షించారు.

దేశంలో చివరిసారిగా బ్రిటీష్ హయాంలో 1931లో కుల గణన జరిగిందని, అప్పటి నుంచి షెడ్యూల్డ్ కులా లు, గిరిజనుల గణన తప్ప, ఇతర కులాలపై అధికారిక గణనేమీ జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవిక గణాంకాలు లేకపోవడంతో దశాబ్దాలుగా ఓబీసీల కు న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు.

94 ఏళ్ల తర్వాత తిరిగి మోదీ ప్రభుత్వం కుల గణనకు శ్రీకారం చుట్టబోతున్నదని కొనియాడారు. కుల గణనపై కాంగ్రె స్ పార్టీతోపాటు ఆ పార్టీ మిత్రపక్షాల ద్వంద్వ వైఖరిని త్వరలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కుల గణన సంగతి మరచి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కుల గణన గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.