calender_icon.png 1 May, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ విధానాన్నే దేశమంతా అనుసరిస్తోంది

01-05-2025 02:00:02 AM

  1. కులగణనపై క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

ప్రధాని మోదీ, మంత్రులకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాం తి): తెలంగాణ రూపొందించి అమలు చేస్తు న్న విధానాలను దేశమంతా అనుసరిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయా న్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా రేవంత్ స్పందిస్తూ..

కే ంద్ర  నిర్ణయంతో రా హుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందన్నారు. రాహుల్ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారని కొనియాడారు. దేశం లో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణేనన్నారు. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడిందని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనూ ఆందోళన చేశామన్నారు.