ఉప్పల్‌లో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి నిధులివ్వండి
మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి
ఉప్పల్, ఆగస్టు 12 (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా ఉప్పల్ నియోజకవర్గంలోని ప లు ప్రాంతాల్లో బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిన్న నేపథ్యంలో వాటి పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబును ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిప త్రం సమర్పించారు. భారీ వర్షాల ప్రభావంతో రహదారులు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలు ప్రాంతాల్లో వర్షపు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా పనిచేయక నీటి నిల్వ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు.ఉప్పల్ నియోజకవర్గంలో కొత్త బీటీ రోడ్ల నిర్మాణం,
దెబ్బతిన్న సీసీ రోడ్ల పునర్నిర్మాణం, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ లైన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రజల సౌకర్యం, సురక్షిత రాకపోకలు, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యల నివారణ కోసం ఈ పనులను అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఉప్పల్ నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి శ్రీధర్ బాబును ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.






