ఉప్పల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి
ముఖ్యమంత్రిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి
కుషాయిగూడ/మేడ్చల్, మార్చి 24 (విజయ క్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికై నిధులు కేటాయించాలని, వచ్చే వారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనరేట్ ఎం ఎం సి భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఉప్పల్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఇంతవరకు మోక్షం లేదని 100 పడకల ఆసుపత్రిని నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలను అందించాలని ముఖ్యమంత్రిని బండారు లక్ష్మారెడ్డి కోరారు.
చర్లపల్లి డివిజన్ టీచర్స్ కాలనీలో 19 వ్యయంతో సీసీ రోడ్లను ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బిఆర్ ఎస్ చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు నేమూరి మహేష్ గౌడ్, బుచ్చన్న గారి శ్రీకాంత్ రెడ్డి, సప్పిడి శ్రీనివాసరెడ్డి, ఆలేటి మహిపాల్ రెడ్డి, టీచర్స్ కాలనీ నాయకులు నరసింహ గౌడ్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఆందోళనకు దూరం
బీఆర్‌ఎస్ ఆం దోళనకు దూరంగా ఉండి సీఎంను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర తీర్చనియాంశమైంది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం సరఫరా లేదంటూ ప్రజలను ఇబ్బంది పెడుతుందని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అమరవీరుల స్తూ పం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే హాజరు కాలేదు.
అదే రోజు అసెంబ్లీలో సీఎంను కలవడం శోచనీ యం. అయితే జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి బుధవారం పార్టీకి రాజీ నామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలో భాగంగా మరొకరిని పార్టీ లో చేర్చుకొని బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానని ఎమ్మెల్యే తెలిపారు. వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన సమయంలో తాను వేరే పనిలో ఉండటం వల్ల పాల్గొనలేకపోయానని తెలిపారు.




