25-05-2025 07:47:26 PM
హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) స్పందించారు. ఆ నలుగురి కబంధహస్తాల్లోనే పరిశ్రమ ఉందంటున్నారని, ఆ నలుగురిలో ఏ మాత్రం తాను లేనని తెలిపారు. ఆ నలుగురి నుంచి తను బయటకు వచ్చినట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఆ నలుగురు అనే మాట ఇప్పుడు కాదు.. 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైందని, తర్వాత నలుగురు, పది మంది అయ్యారని, అది ఎవరూ పట్టించుకోవాడంలేదని వెల్లడించారు. తెలంగాణలో అల్లు అరవింద్ కు ఒక థియేటర్ కూడా లేదని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తన థియేటర్లు 15 లోపే ఉన్నాయన్నారు.
లీజ్ పూర్తయ్యాక రెన్యువల్ చేయవద్దని అరవింద్ సిబ్బందికి చెప్పి, ఆ 15 థియేటర్లను కూడా వదిలేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల మూసివేతపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడింది సమంజసమైందని, సింగిల్ స్క్రీన్స్ కష్ట్రాల్లో ఉన్నయని స్పష్టం చేశారు. థియేటర్లకు సంబంధించి మూడు సమావేశాలు జరిగాయని, తాను మాత్రం ఏ మీటింగ్ కు వెళ్లలేదని, తన వాళ్లనూ కూడా వెళ్లవద్దని చెప్పినట్లు నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
సమస్యలుంటే సినిమా థియేటర్ల యజమానులు ఫిల్మ్ ఛాంబర్ లో, సినీ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి. సమస్య పరిష్కారం కాకుంటే ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లాలని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ వేళ థియేటర్లు మూసేస్తామనడం దుస్సాహసమే అని అల్లు అరవింద్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ మన ఇండస్ట్రీ నుంచి వెళ్లిన వ్యక్తి అని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్లు ఎవరూ చంద్రబాబు, పవన్ ను కలవలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వెళ్లాలి కదా.. కానీ ఎవరూ వెళ్లలేదని చెప్పారు. మాది ప్రైవేట్ వ్యాపారం.. ప్రభుత్వానితో సంబంధం లేదని ఎవరో అన్నారు.. మరి ప్రభుత్వంతో సంబంధం లేనప్పుడు గత ముఖ్యమంత్రి జగన్ ను ఎందు కలిశారు..? అని ప్రశ్నించారు.
సినీ పరిశ్రమాలో ఉన్నవారికి ప్రభుత్వంతో సంబంధం ఉంటుందని, వారి సహకారం కావాలని అల్ల అరవింద్ చెప్పుకోచ్చారు. మనకు కష్టం వస్తేగాని ప్రభుత్వ పెద్దలను కలవమా..?, ఏపీ సినిమాటోగ్రాఫి నుంచి వచ్చిన ప్రశ్నలు సబబుగానే ఉన్నాయన్నారు. థియేటర్లు మూసేస్తున్నాం.. చర్చలకు రమ్మనడం నచ్చలేదు.. అందుకే వెళ్లలేదని అరవింద్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ బాధపడింది వందశాతం నిజం, అతని సినిమాపై వ్యతిరేకతతో బంద్ కాదంటున్నారు కానీ ఇవన్ని ముందే ఆలోచించాలని అల్లు థియేటర్ల యజమానులపై విరుచుకుపడ్డారు. తన వద్ద నుంచి సినిమా తీసుకెళ్లేది థియేటర్ ఓనర్ కాదు.. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, ఎగ్జిబిటర్ కు ఏం కావాలో ఆలోచించాలని, క్యూబ్ కంపెనీలో తనకు వాటా లేదని, అలాగని భాగస్వామిని కాదు అన్నారు. క్యూబ్ కంపెనీ సురేశ్ బాబు చేతుల్లో కూడా లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు అరవింద్ సమాధానం ఇచ్చారు.