calender_icon.png 26 May, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను ఏ హీరోతో చూడాలనుందో చెప్పండి!

25-05-2025 12:00:00 AM

మాళవిక మోహనన్ తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా  ఆసక్తి కర సమాధానాలిచ్చింది. “ప్రభాస్‌ను కలువక ముందు.. తను ఇతరులతో పెద్దగా కలవరనుకున్నా. చాలా సైలెంట్‌గా ఉంటారనిపించింది. కానీ, ‘రాజాసాబ్’ కోసం పనిచేస్తున్నప్పుడు.. నా ఆలోచన తప్పును అని అర్థమైంది.

ఆయన ఎంతో సరదాగా ఉంటారని.. అద్భుతంగా మాట్లాడతారని తెలుసు కున్నా. సెట్లో ఆయన ఉంటే ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు.  ఇక ‘హృదయపూర్వం’ షూట్ మూడు రోజుల క్రితమే పూర్తయ్యింది. నిజంగా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపో తున్నా” అని తెలిపింది. 

మళ్లీ తెలుగులో చేస్తున్న చిత్రమేది? అన్న ప్రశ్నకు.. మీరే చెప్పండి, నన్ను ఏ హీరోకు జంటగా చూడాలనుకుంటున్నారో?! అంటూ ప్రశ్నతోనే బదులిచ్చింది. ‘నేను మిమ్మల్ని మాలు అని పిలవచ్చా? అని ఓ అభిమాని ప్రతిపాదనకు.. ‘నా కుటుంబసభ్యులు, స్నేహితులు అదేవిధంగా పిలుస్తారు. కాబట్టి మీరూ పిలవొచ్చు’ అని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.