05-10-2025 09:26:52 PM
ఎం ఎస్ కె ప్రసాద్..
సూర్యాపేట (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మాజీ ఇండియన్ క్రికెటర్, చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డు క్రికెట్ గ్రౌండ్‌లో ఎంఎస్‌కే ప్రసాద్ ఇంటర్నేషన్ క్రికెట్ అకాడమీ సూర్యాపేట ఆధ్వర్యంలో ఎంఎస్‌కే ఐసీఏ అండర్ 16 క్రికెట్ టోర్నమెంట్‌ను గత పది రోజుల పాటు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలతో ఆరోగ్యంతో పాటు శారీరక ధారుడ్యం, మానసిక వికాసం కలుగుతుందన్నారు.
ఫ్రీడమ్ క్రికెట్ అకాడమీ నల్లగొండ వారికి ప్రథమ స్థానం లభించగా ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ సూర్యాపేట వారు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. బెస్ట్ బ్యాటర్ గా డి విష్ణు, బెస్ట్ బౌలర్‌గా రోషన్, ఎంవీపీ ఆజాం, బెస్ట్ ఫీల్డర్ అఖిలేష్ యాదవ్‌లను అభినందించారు. ఈ కార్యక్రమంలో అర్జున్ అవార్డు గ్రహిత నాగపురి రమేష్, నల్లగొండ జిల్లా సెక్రటరీ సయ్యద్ అమీన్ బాబా, డాక్టర్ సందీప్, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ భరత్, హెడ్ కోచ్ ఉస్మద్ తదితరులు పాల్గొన్నారు.