calender_icon.png 5 October, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యాడంపల్లిలో విషాదం..

05-10-2025 08:31:25 PM

బావిలో పడి వ్యక్తి మృతి..

మల్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన మిర్యాల అవంతి బావి మోటర్ రిపేర్ కాగా, ఎలక్ట్రిషన్ ఊకంటి శ్రీపాల్ రెడ్డి(48) వ్యవసాయ బావి ఒడ్డున మోటార్ స్టాటర్ రిపేర్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడి భార్య ఊకంటి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైనరేష్ తెలిపారు.