calender_icon.png 5 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

05-10-2025 08:01:49 PM

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో ఆదివారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం కార్గిల్ సెంటర్ నందు సాధారణ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలతో ఆడుకునే డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నిబంధనల ఉల్లంఘనను అస్సలు ఉపేక్షించం.. ఎవరైనా నియమాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల సబ్ ఇన్స్పెక్టర్ సతీష్, కోటేశ్వరరావు, కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.