05-10-2025 08:19:10 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జె ప్రసన్న కుమారి అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని కడపలో ఉన్న గ్లోబల్ జ్ఞాన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రసన్నకుమారి ఎంపికయ్యారు. మొత్తం 1390 దరఖాస్తులు రాగా వాటి నుంచి తుది జాబితాకు 20 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.
వారిలో జూలీ ఎంపిక చేసిన టాప్ 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో డాక్టర్ జె ప్రసన్నకుమారి కూడా ఉండటం విశేషం. ఆమె అందించిన ఆవిష్కరణాత్మక బోధన విధానాలు, విద్య నాయకత్వం, విద్యార్థి కేంద్రీక అభ్యాసంపై కట్టుబాటు కారణంగా ఈ గుర్తింపు లభించినట్లు ఆమె వివరించారు. అవార్డు తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లతో పాటు జిల్లా విద్య వర్గాలకు గర్వకారణమని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పలువురు డాక్టర్ జె ప్రసన్నకుమార్ కి అభినందనలు తెలిపారు.