05-10-2025 09:56:35 PM
భారీగా చెలరేగిన మంటలతో ట్రాఫిక్ జామ్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు లారీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని సీతాగొంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం హైదరాబాదు నుండి నాగపూర్ కు వెళ్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఓ లారీ క్యాబిన్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు లారీ పూర్తిగా దగ్ధమైయ్యాయి. భారీగా మంట ఎగిసిపడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండు లారీ ల్లోంచి భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా లారీల్లోని సామాగ్రి పూర్తిగా దగ్దం అయింది. అటు ఈ ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు.