05-10-2025 10:54:02 PM
మహిళల ప్రపంచ కప్ 2025: కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన బ్లాక్‌బస్టర్ మహిళల ప్రపంచ కప్(ICC Women's World Cup-2025) మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 88 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 159 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో పాకిస్తాన్‌పై భారత్‌కు 12-0 హెడ్-టు-హెడ్ ఆధిక్యాన్ని ఇస్తుంది. పాక్ బ్యాటింగ్ లో సిద్రా అమీన్(81), నటాలియా(33), సిద్రా నవాజ్(14) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్ లో దీప్తి, క్రాంతికి చెరో మూడు వికెట్లు పడగొట్టగా స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసుకుంది. అటు భారత్ బ్యాటింగ్ లో హార్లీన్ డియోల్ (46), రిచాఘోష్ (35), జెమీయా(32), ప్రతీక(31), దీప్తిశర్మ(25), స్మృతి మంధాన(23) పరుగులు చేశారు.