calender_icon.png 5 October, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాజాపూర్ లోని నీటి సమస్యపై స్పందించిన అధికారులు

05-10-2025 08:41:51 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల ప్రాంతంలోని ఖాజాపూర్ గ్రామంలో నిన్న వచ్చిన వార్త పత్రికల కథనాలకు స్పందించిన అధికారులు గత వారం రోజుల నీటి సమస్యపై పోరాడుతున్న గ్రామస్తులకు అధికారులు ఈఈ షేక్ పాషా, డిఈఈ పహాని వర్మ, ఏఈ జైపాల్ ఊరట కలిగించడం జరిగింది. గ్రామంలోని కొన్ని పాత బోర్లలో మోటర్ బిగించి వాటర్ ను అందించడం జరిగింది. ప్రజలు కొంత మేరకు నీటి సౌకర్యం కల్పించడం వలన ప్రజలు కొంతవరకు ఊరట కలగడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని ప్రజలు ప్రతినిత్యం కాల కృత్యాలు తీర్చుకోవడానికి నీరు అందించేలా అధికారులకు కోరటం జరిగింది. అధికారుల స్పందించి మిషన్ భగీరథ వాటర్ పైపు లీకేజీ వలన వాటర్ అందటం లేదని రెండు రోజుల్లో నీరు అందించేలా చూస్తామని గ్రామ ప్రజలకు తెలపడం జరిగింది. ప్రజలు అధికారులకు మా సమస్య త్వరగా క్లియర్ చేయాలని అధికారులకు కోరడం జరిగింది. అధికారులు స్పందించి కంప్లీట్ చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.