calender_icon.png 5 October, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుంది

05-10-2025 08:36:54 PM

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 సీట్లు గెలిచి తీరుతాం..

మాజీమంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు..

గాంధారి (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని మాజీమంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం రోజున గాంధారి మండలంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలోని సొసైటీ నుండి భారీ బైక్ ర్యాలీతో హరాలే గార్డెన్ వరకు చేరుకొని అనంతరం ఇక్కడ ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ జెడ్పిటిసి హరాలే తానాజీరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు నాయకులు కార్యకర్తలు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ కాలం నుండి  పార్టీలో ఉంటూ ఉద్యమకారుడుగా పేరు తెచ్చుకున్న తానాజీ రావు బీజేపీకి వెళ్లి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేయడం శుభసూచకమని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గురించి అర్థం అయిపోయిందని అన్ని వర్గాల ప్రజలు, రైతులు చెందారని విసుగు చెందారని ఇప్పుడు రాష్ట్రంలో ఎవరిని అడిగినా బీఆర్ఎస్ కావాలని అంటున్నానని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచిపోయింది, ఉన్నది ఇంకా రెండేళ్లు. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని అన్నారు. బీజేపీ దేశం కోసం ధర్మం కోసం అంటూ డైలాగులు కొట్టింది. మోడీ గారు సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే సబ్కా వికాస్ కాదు ఓ పూర బక్ వాస్ బిజెపి పేద ప్రజల, రైతుల పక్షాన ఉండదు. దళితుల పక్షాన ఉండదు. కేవలం నార్త్ ఇండియా వైపే ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ దేశంలో లేదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వరు అని బీజేపీ, బీజేపీ పార్టీ నాయకులను ప్రశ్నించారు. నిజాంబాద్ జిల్లా కందకుర్తి దగ్గర గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంద అన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్  నాయకత్వంలో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగింది.

కేసిఆర్ 24 గంటల కరెంటు తో పాటు రైతుబంధు పథకం, మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేయడం జరిగిందని, పండించిన ప్రతి గింజను ఒంగోలు కేంద్రం ద్వారా కొనడం జరిగిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు ఇవ్వరు అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా, మెడికల్ కాలేజీలు గుండు సున్నా. నవోదయ విద్యాలయాలు గుండు సున్న. చివరికి వడ్లకు మద్దతు ధర ఇయ్యమంటే మొండి చెయ్యి చూపించారని ఆయన ఆవేదన చెందారు. బిజెపికి ఓటేసినందుకు ఒక్కొక్క రైతు ఎకరానికి 7000 రూపాయలు నష్టపోతున్నారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే, పరిశ్రమలు పెట్టాలంటే నిధులు ఇయ్యరు. రైల్వే లైన్లకు నిధులు ఇవ్వరు. హైవే కోసం నిధులు ఇవ్వరు అని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. రేపు వచ్చేది  బీఆర్ఎస్ గవర్నమెంట్ అని అన్నారు. రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్. అని ఆయన అన్నారు. ప్రజలకు పాలేందో నీలేవో తెలిసిపోయింది. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా నాయకులు ఆధైర్యపడకూడదని ఎవరెవరు అధికారులు పోలీసోళ్ళు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరి సంగతి చెప్తాం. 

పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండండి. పోయిన 10 ఏళ్లు ఊకున్నాం. ఈసారి అట్లుండదు. ఈసారి అభివృద్ధి చేస్తాం. ఎక్స్ట్రాలు చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం.కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. వచ్చేది బీఆర్ఎస్ పార్టీ పార్టీ అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వస్తానని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలను కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ గంప గోవర్ధన్ హనుమంత్ సిండే, జనార్దన్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజుబుద్దిన్, మాజీ జడ్పీ చైర్మన్ రాజు శోభతో పాటు గాంధారి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివాజీ రావు,రెడ్డి రాజులతో పాటు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.