18 April, 2026 | 1:05 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

అనంతారంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

08-06-2025 05:51 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్ధులంతా కలసి పూర్వ విద్యార్ధుల సమ్మేళన కార్యక్రమము ఆదివారం కనుల పండువగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రస్తుతం ఉంటున్న జీవన నేపద్యంపై ఒకరినొకరు ప్రస్తావించుకున్నారు. కాగా చదువు నేర్పిన అప్పటి తమ గురువులను ఘనంగా పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించుకున్నారు.

తరగతి గదిలో చేసిన చిలిపి పనులు, మార్కులు తక్కువ వచ్చినందుకు తమ గురువులు చేసిన దండనను గుర్తు చేసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో కలసి ఆట పాట చేపట్టి గురువులతో కలిసి సహాఫంక్తి భోజనం చేశారు. ఆనాటి గురువులు ఒంటెద్దు వెంకట్రెడ్డి మల్లిరెడ్డి రాఘవరెడ్డి, వీరయ్య, నారాయణ మల్లారెడ్డి లను విద్యార్థులు ఘన సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బైరెడ్డి భద్రారెడ్డి, కోటిరెడ్డి తిరుపతి, పల్లెపంగు మదన్, తదితరులు ఉన్నారు.