calender_icon.png 11 August, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు

11-08-2025 01:58:31 AM

  1. నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద
  2.   8 గేట్లు ఎత్తివేసిన అధికారులు
  3. పెరిగి సందర్శకుల తాకిడి

నాగార్జునసాగర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ర్టలో కురుస్తున్న భారీ వర్షాలకు తె లంగాణలోని కృష్ణా, దాని ఉపనదులు ఉ ప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృ ష్ణా నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, తుంగభ ద్ర, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, శ్రీ శైలం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద కారణం గా నాగార్జునసాగర్ జలాశయానికి వర ద పోటెత్తుతోంది.

అప్రమత్తమైన అధికారు లు జలాశయం 8 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో బరాజ్ నిండుకుండలా మా రింది. ఈ సీజన్‌లో జూలై 29న తొలిసారిగా సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక, సాగర్‌కు ఎగు వ నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గడంతో గత ఆదివారం ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం భారీగా వరద వ స్తుండటంతో.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో 8 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పూర్తిస్థాయి నీటిమట్టం.. 

సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 590 అడుగుల వద్ద నీరు నిల్వ వుంది. డ్యా మ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 0450 టీఎంసీలు కాగా అదే స్థాయిలో నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేం ద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29, 070 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 64 65 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 7,518  క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, లోలేవల్ కెనాల్ ద్వా రా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి మొత్తం 1,09, 952 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 65,842 క్యూసెక్కులు కొనసాగుతుంది. ఔట్ ఫ్లో 1,09,952 క్యూసెక్కులుగా ఉంది.