14-05-2025 06:02:58 PM
ఏరియా పిఎం శ్యాం సుందర్..
మందమర్రి (విజయక్రాంతి): కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఏరియాలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో యువతీ, యువకులకు తేనె తీగల పెంపకంపై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తుందని సింగరేణి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాం సుందర్(Singareni Area Personnel Manager Shyam Sundar) తెలిపారు. జిఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల పిల్లలు, సింగరేణి ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాలు, భూ నిర్వాసితులకు, నిరుద్యోగ యువతకు, పరిసర గ్రామాల యువతి యువకులకు, సింగరేణి సేవ సమితి సభ్యులకు, స్వయం ఉపాధి కల్పించేందుకు తేనెటీగల పెంపకంలో శిక్షణను అందించి ప్రోత్సహిఇస్తుందన్నారు.
తేనెటీగల పెంపకం వలన పర్యావరణ అభివృద్ధి జరిగి జీవవైవిద్యం, పరాగ సంపర్గానికి దోహదం చేస్తుందన్నారు, అంతే కాకుండా స్థానికులకు స్థిరమైన ఆదాయ వనరును అందిస్తుందని ప్రతి ఒక్కరు శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని కోరారు. తేనె తీగల పెంపకం శిక్షణ పూర్తిగా ఉచితంగా ఉంటుందని ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను జిఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్టుమెంట్ లోని సింగరేణి సేవాసమితి/కమ్యూనికేషన్ సెల్ నందు అందచేయాలని కోరారు.