బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
నిర్మల్,(విజయక్రాంతి): డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దేశానికి, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆ మహనీయుడు చేసిన సేవలు మరువలేనివనివని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సైతం వారు కృషి చేసినట్లు తెలిపారు.
అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మెడిసమ్మె రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, కౌన్సిలర్లు సాధం అరవింద్, శ్రీరామోజీ నరేష్, కూన శశాంక్, కృష్ణమోహన్, ముత్యం, ధర్మాజీ గారి ఈశ్వర్, సూరజ్ నాయక్, విఠల్, సాత్విక్, అర్జున్, జింక సూరి, ఖమ్మం సురేందర్, గంజి రాజు, పట్టణ బీజేపీ నాయకులు పొన్నం నారాయణ గౌడ్, చరణ్ మౌర్య, గిల్లీ విజయ్, పుదరి రంజిత్, నేరేల్ల సాయి, సంతోష్, లింగయ్య, తో పాటు తదితరులు పాల్గొన్నారు.






