భార్య పిల్లలను తలచుకోండి.. సేఫ్ గా వెళ్ళండి
14-04-2026 06:38 PM
నిర్మల్,(విజయక్రాంతి): కుటుంబ పోషణ కోసం డ్రైవర్ వృత్తిని తీసుకున్న మీరు ఎప్పుడు భార్య పిల్లలను తలుచుకుంటూ సేఫ్ ప్రయాణం చేయాలని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి డ్రైవర్లకు క్లీనర్లకు కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల డ్రైవర్లకు, క్లీనర్లకు రోడ్ సేఫ్టీ భద్రతపై అవగాహన కల్పించారు. ఆరోగ్య కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీలు రాజేష్ మీనా, సాయికుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.






