14 April, 2026 | 7:09 PM

Breaking News

ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?: విద్యార్థి సంఘ నేతలు   •   బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ కు ఘన సన్మానం   •   అంబేడ్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకం   •   బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ   •   వైశాఖీ పండుగకు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత: డాక్టర్ కోట నీలిమ   •   ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానుకోవాలి   •   దశల వారిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా   •   యాదగిరిగుట్టలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు   •   నల్లచేరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   కరీంనగర్ లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •  

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 03:12 PM

గ్రామ యువతకు టీషర్ట్లు పంపిణీ

ఆశయాలను కొనసాగించాన్న పిలుపు

సిద్దిపేట రూరల్: అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సీతారాంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతల రత్నాకర్ గౌడ్ మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

శంకర్ నగర్ గ్రామ యువతకు టీషర్ట్లు అందజేస్తూ యువత సామాజిక సేవలో ముందుండాలని సూచించారు. సమాజ అభివృద్ధికి అంబేద్కర్ చూపిన మార్గం ఎంతో ప్రాముఖ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లీశ్వరి, ఉప సర్పంచ్ మిట్టపల్లి సుధాకర్, గుర్రం రాజశేఖర్ రెడ్డి, భూలక్ష్మి, మిట్టపల్లి నాగరాజు, పడిగే శ్రీనివాస్, మిట్టపల్లి కిషన్, మిట్టపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.